- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఏడాది కాకముందే జాతీయ రహదారికి గండి.. పాలమూరులో పలుచోట్ల కుంగిపోయిన రోడ్డు..
ఏడాది కాకముందే జాతీయ రహదారికి గండి.. పాలమూరులో పలుచోట్ల కుంగిపోయిన రోడ్డు..
by Kalyani |
X
దిశ, మహబూబ్ నగర్: సంవత్సరం గడవక ముందే కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన జాతీయ రహదారికి పలుచోట్ల గండ్లు పడగా, మరికొన్ని చోట్ల కుంగి పోయింది. వివరాల్లోకి వెళితే జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం మీదుగా రాయిచూర్ వరకు నిర్మించిన 167 వ జాతీయ రహదారి విస్తరణ పనులను ఏడాది కాలం క్రితమే చేశారు.
అకాల వర్షాలు కురుస్తుండడం, రోడ్డుపై నుంచి వాహనాలు వెళుతుండడంతో పలుచోట్ల కుంగిపోయి గండ్లు పడ్డాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది ప్రమాదాలు జరగకుండా, ఒకచోట పాత సూట్ కేసు, చెట్టు కొమ్మలు, మరికొన్ని చోట్ల చెత్త వేశారు. నాణ్యత పాటించకుండా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు, వాహన చోదకులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Next Story