బీఫామ్ నాకే వస్తది : ఎమ్మెల్యే అబ్రహం

by Kalyani |   ( Updated:2023-10-30 12:31:48.0  )
బీఫామ్ నాకే వస్తది : ఎమ్మెల్యే అబ్రహం
X

దిశ, అలంపూర్ : అలంపూర్ ప్రజల ఆశీర్వాదం.. కేసీఆర్ అండదండలతో బీఆర్ఎస్ బీఫామ్ నాకే దక్కుతుందని గంట పదంగా ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. సోమవారం అలంపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుడు ఇస్మాయిల్ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేకు అని ముందుగానే డిక్లేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. పార్టీలో సభ్యత్వం లేని నాయకులు .. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు కావాలని బీఆర్ఎస్ పార్టీని బ్రష్టు పట్టించాలని ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పూర్తి నమ్మకం నాకు ఉందని... పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పాటుపడ్డానని... బీఫామ్ నాకే డిక్లేర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అలంపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు ఎవరూ కూడా అధైర్య పడవద్దని బీఫామ్ అందిన వెంటనే ప్రచారం కూడా షూరు చేస్తామని అన్నారు. అలంపూర్ లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని... ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అలంపూర్ లో ప్రచారం చేసిన కొంతమంది నాయకులకు పార్టీలో కనీసపు సభ్యత్వం కూడా లేదని... వారు వేసుకున్న కండువాల పై కేసీఆర్ బొమ్మ లేకుండా చల్లా బొమ్మ పెట్టుకోవడం ఏమిటని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బ్రష్టు పట్టించడానికి ఆరోపించారు.

Advertisement

Next Story