చట్ట వ్యతిరేకుల పట్ల కఠినంగా వ్వవహరించండి : ఎస్పీ నరసింహ

by Kalyani |
చట్ట వ్యతిరేకుల పట్ల కఠినంగా వ్వవహరించండి : ఎస్పీ నరసింహ
X

దిశ, మహబూబ్ నగర్: చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం సందర్భంగా వచ్చిన ఫిర్యాదుల పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడారు.

శాంతి భద్రతల పరి రక్షణలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇస్తూ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బాధితులకు అండగా ఉంటూ ప్రతి ఫిర్యాదుపై చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 13ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కార నిమిత్తం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ రమణారెడ్డి, ఎస్బీ సీఐ రాజు, ఆర్ఐ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story