- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ కార్యదర్శిపై దాడి.. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో పోలీసుల జాప్యం
దిశ, అమరచింత: విధుల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీపై మాజీ వార్డ్ మెంబర్ దాడి చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని రేచింతల గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మన్నెంపై సోమవారం నాడు స్థానిక మాజీ వార్డ్ మెంబర్ దాడి చేసినట్లు బాధితుడు మన్యం తెలిపారు. ఈ విషయంలో ఈ నెల 26న పంచాయతీ సెక్రెటరి మన్నెం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని వివరించాడు.
కాగా, గ్రామంలో స్ట్రీట్ లైట్స్ సమస్య గురించి ప్రశ్నించిన మాజీ వార్డు మెంబర్ ఉంద్యాల రాములు, అంతటితో ఆగకుండా తనపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాధితుడు తెలిపారు. రెండు రోజులుగా తనకు న్యాయం జరగకపోవడంతో నేడు పంచాయతీ కార్యదర్శులతో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కార్యదర్శి మన్నెం వెల్లడించారు.