అచ్చంపేట SBI BANK లో వినియోగదారుల డబ్బులు కాజేసిన ఉద్యోగి

by Kalyani |   ( Updated:2024-02-03 13:50:17.0  )
అచ్చంపేట  SBI BANK లో వినియోగదారుల డబ్బులు కాజేసిన ఉద్యోగి
X

దిశ, అచ్చంపేట : ఎస్బీఐ బ్యాంకులో వినియోగదారులు డబ్బులు జమ చేసుకుంటే అట్టి డబ్బులను దొడ్డి దారిన వినియోగదారులకు తెలవకుండా కాజేసి మోసం చేసిన సంఘటన అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఆలస్యంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన అనిత తన భర్త ఇటీవల మరణించడంతో ప్రభుత్వం మంజూరు చేసిన రైతు బీమా ద్వార 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే డబ్బులను బ్యాంకు అధికారికి నాలుగు లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేయమని చెప్పగా ... అందుకు అంగీకరించి రూ. నాలుగు లక్షలు డిపాజిట్ చేశారని కానీ ఆ బ్యాంకు అధికారి తప్పుడు డిపాజిట్ పత్రాలు అందజేసి మోసం చేశాడని బాధితురాలు అనిత లబోదిబోమని రోధిస్తుంది.

అలాగే ఇదే మండలం తాడూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి తన అవసర నిమిత్తం భూమిని అమ్ముకుని అందుకు వచ్చిన డబ్బులను రూ. 14 లక్షల 35 వేల పై వినియోగదారుడు ఎస్బీఐ బ్యాంకు లో తమ అకౌంట్లో జమ చేసుకోగా డబ్బులను అప్పనంగా బ్యాంకు ఉద్యోగి కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని లబో దిబో అంటున్నాడు. గత రెండు మూడు రోజుల క్రితం తండ్రి ఆరోగ్యం బాగుపరిచేందుకు డబ్బులు తీసేందుకు బ్యాంకుకు వెళ్ళగా.. నీ అకౌంట్లో డబ్బులు లేవు అని బ్యాంక్ అధికారులు తిరిగి చెప్పడంతో అయోమయం అయ్యానని బాధితులు అతని బంధువులు తెలిపారు.

ఈ బ్యాంకు లోనే మరిన్ని మోసాలు జరిగినట్టు బాధితులందరూ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అచ్చంపేట మండల ప్రజలు వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ ను మీడియా వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి గత నెల రోజులుగా బ్యాంకు ఆర్బిఐ అధికారులు అంతర్గతంగా విచారణ చేపడుతున్నారని అట్టి తప్పిదాలకు ఎవరు పాల్పడ్డారో ఉన్నతాధికారులు తేలుస్తారని సమాధానమిచ్చారు.

Advertisement

Next Story