- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఏర్పడ్డాక తొలి విజయం విద్యుత్ రంగంలోనే: మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి ప్రతినిధి: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విజయం విద్యుత్ రంగంలోనే సాధించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి గార్డెన్లో నిర్వహించిన విద్యుత్ సంబరాలలో మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని చాలామంది విమర్శించారని అలాంటిది రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఏ ఒక్కనాడు విద్యుత్ సమస్య అనేది లేకుండా అధిగమించడం గొప్ప విజయమని మంత్రి అన్నారు. దీనికంతటికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగం పై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంస్కరణలు తీసుకురావడమే వల్లనే సాధ్యమైందని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు నిరంతరం కరెంట్ కోతలతో రైతులు ప్రజలు ఎంతో ఇబ్బందుల పాలు అయ్యేవారని అలాంటిది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏ ఒక్కనాడు కరెంటు సమస్య లేకుండా మిగులు విద్యుత్ సాధించడం గొప్ప విషయం అన్నారు. నాడు కరెంటు లేక కళ్ళముందే పంటలు ఎండిపోయేవని నేడు నిరంతర సరఫరా ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్ సాధించామన్నారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కిందన్నారు. ఐదు దశాబ్దాల కిందట గ్రామాలలో విద్యుత్ సరఫరా అనేదే ఉండేది కాదని ప్రతి ఇళ్లలో లాంథర్ దీపాలు ఉపయోగించేవారని మంత్రి గుర్తు చేశారు. వనపర్తి నియోజకవర్గం లో మెరుగైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల నాడు 80 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా నేడు లక్ష 28 వేల కు పెరిగాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ తేజ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.