శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

by Kalyani |
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
X

దిశ, నారాయణపేట క్రైమ్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మల్టీ జోన్ -2 ఐజి సత్యనారాయణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన జెండా వివాదం ఘటన దృశ్య గురువారం జిల్లా కేంద్రంలో భారీ పోలీసుల మధ్య ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జెండా వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య రాళ్లు రువ్వు కోవడం వరకు దారితీసిన విషయం తెలిసిందే. ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రం ప్రధాన రహదారి మీదుగా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. మల్టీ జోన్ -2 ఐజి సత్యనారాయణ, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ జిల్లా కేంద్రంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్టీ జోన్-2 ఐజి వి. ఎస్పీలు యోగేష్ గౌతమ్, గైక్వాడ్ వైభవ్, వెంకటేశ్వర్లు తో కలిసి మాట్లాడారు. యువత ముఖ్యంగా సంయమనం పాటించాలని అనవసరమైన గొడవలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షిస్తామన్నారు. అల్లర్లలో పాల్గొన్న 20 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. నారాయణపేట జిల్లాలో ఎప్పుడు శాంతియుత వాతావరణం ఉండేలా ఇరు వర్గాల మత పెద్దలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనలు తిరిగి జరగకుండా చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed