టూరిస్టులకు దర్శనం ఇచ్చిన పెద్దపులి..

by Sumithra |
టూరిస్టులకు దర్శనం ఇచ్చిన పెద్దపులి..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ వారు నల్లమల్ల అందాలను తిలకించేందుకు సఫారీ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం టైగర్ సఫారీలో నల్లమల్ల పకృతి అందాలను చూస్తూ వెళుతున్న సఫారీ వాహనానికి అతి సమీపంలో వ్యూ పాయింట్ వద్ద విజిటర్స్ పెద్దపులిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.

పెద్దపులిని చూసే అదృష్టం అందరికీ దొరకదని, అటవీ శాఖ అధికారులు, పకృతి ప్రేమికులకు సఫారీ సౌకర్యాలు కల్పించడంతో సాధ్యమవుతుందని యాత్రికులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మన్ననూర్ ఉప అటవీ క్షేత్ర అధికారి రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed