రసవత్తరంగా సాగిన గ్రామసభ.. కబ్జాకోరుల అవినీతిని అరికట్టడంపై తీవ్ర చర్చ

by Anjali |
రసవత్తరంగా సాగిన గ్రామసభ.. కబ్జాకోరుల అవినీతిని అరికట్టడంపై తీవ్ర చర్చ
X

దిశ, ఉప్పునుంతల: మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభ రసవత్తరంగా సాగింది. మండల ప్రజా పరిషత్ అధికారి బాలచంద్ర సృజన్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో పలు తీర్మానాలు చేసి గ్రామంలో నెలకొన్న సమస్యలపైన మరియు వెల్టూర్ స్టేజి పై జరిగిన భూకబ్జాలను ఎండగట్టడం పై పలు సందర్భాలపైన గ్రామస్తులు చర్చ జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రధానంగా లేవనెత్తిన అంశాలు.. గేట్ మీద ఉన్న భూమి పై పూర్తి విచారణ చేపట్టి కబ్జాకు గురైన భూమిని గ్రామ పంచాయతీ తీసుకోవాలని చర్చించారు. గ్రామంలో గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు కు కిరువైపుల హద్దులు పెట్టాలని కోరారు. కోతుల బెడద, కుక్కల బెడద, పందుల బెడద పై ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు. సీసీ రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని అడిగారు. అవసరం ఉన్న చోట కొత్త కొత్త విధి స్తంభాల ఏర్పాటు లైన్లు మార్చడం గురించి చర్చించారు. గ్రామంలో అవినీతి పరుల వ్యవస్థను రూపుమార్పి నూతన నాయకత్వంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అందుకు గ్రామంలో పత్తిఒక్కరు పార్టీలకతీతంగా పనిచేయాలని ఊరికి న్యాయం చేయడంలో అందరూ ఏకధాటిగా పనిచేయాలని కోరారు. అంగను వాడి కేంద్రంలో నూతన బాత్రూం ఏర్పాటు పై చర్చించారు. ప్రాథమిక వైద్యశాలకు ప్రహారీ గోడ ఏర్పాటు చేయాలని కోరారు. వెటర్నరీ హాస్పిటల్‌లో డాక్టర్లు అందుబాటులో ఉండాలని చర్చించారు.

కొత్త మిని అంగన్ వాడి నిర్మాణం చేయాలని తదితర అంశాలపై చర్చించడం జరిగింది, ప్రధానంగా గ్రామ పరిధిలో ఉన్న వెల్టూర్ స్టేజి పై ఉన్న సత్తమ్మ పేరు మీద ఉన్న భూమి కబ్జా పై వెంటనే విచారణ చేసి గేట్ పై ఇల్లిగల్ గా ఉన్న ప్లాట్ పై ఎవరు ఎలాంటి క్రయ విక్రయాలు జరుపరాదని కబ్జాకు గురైన 39కుంటలపై భూమి పై వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు స్పందించాలని కోరారు. ప్రదీప్ రెడ్డి s/oజంగి రెడ్డి R/o వెల్టూర్ గ్రామ గేటు వద్ద గల భూమి సర్వే నెంబర్ 213 AB 1/1/1 గల 2600 గుంట ల భూమి బుల్లెపోగు మురళీధర్ అనే వ్యక్తి అక్రమంగా పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేకుండా తప్పుడు దస్తావేజులు సమర్పించి, అక్రమించుకోవడం జరిగిందని స్థానిక పట్టాదార్ గ్రామసభల్లో ఇట్టి విషయాన్ని లేవనెత్తారు, భూమిని గ్రామపంచాయతీ అనుమతి లేనిది ఎలా జరిగిందని వారు విమర్శించారు, అధికారులు వెంటనే స్పందించి తక్షణమే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు,

దీనిపై గ్రామ ప్రజలు ఆలోచన చేసి

గ్రామంలో అవినీతి కబ్జా దారుల మోసాలను అరికట్టి గ్రామాన్ని సమన్వయంతో పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని, వెంటనే అధికారులు స్పందించి కబ్జా చేసిన ప్లాట్ లపై బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి రంగారెడ్డి పంచాయితీ కార్యదర్శి ఉమాశంకర్, మరియు గ్రామ స్థాయి అధికారులు భరత్ వేదవతి బాలమణి, స్వప్న, రజిత, చంద్రకళ దేవేందర్ పరియు పలువురు యువ నాయకులు గుద్దెటి బాలరాజు, ఉప్పరి బాలరాజు, యాటా సైదులు,అమరేందర్ రెడ్డి నరేష్ యాదవ్, వెంకటయ్య, రమేష్ , ప్రదీప్ రెడ్డి, జంగయ్య, సైదులు, వెంకటేష్, భాస్కర్, శ్రీను, లింగమయ్య, జంగరావు, నాగరాజు, శ్రీను వెంకటేష్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed