తల, మొండెం వేరుగా ఉన్న మృతదేహం లభ్యం

by Shiva |
తల, మొండెం వేరుగా ఉన్న మృతదేహం లభ్యం
X

దిశ, కృష్ణ: నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెం.1 పట్టాలపై సొమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ తల మొండెం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై కృష్ణ రైల్వే స్టేషన్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సతీష్ వివరణ కోరగా కృష్ణ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెం.1 పట్టాలపై దాదాపు వయసు 60 నుంచి 65 సంవత్సరాలు గుర్తు తెలియని మహిళ తల మొండెం మాత్రమే పడి ఉందని తెలిపారు. మృతురాలి దేహం కోసం దాదాపు 100 కి.మీ వరకు వెతికిన ఆచూకీ దొరకలేదని తెలిపారు. మృతురాలి తల మొండెన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి పంపించమని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story