- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మక్తల్ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో 1288 మంది సిబ్బంది
దిశ, మక్తల్ : మక్తల్ అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గంలో గురువారం జరిగే పోలింగ్ కోసం నియోజకవర్గంలో 1288 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని రిటర్నింగ్ అధికారి మయాంక్ మిట్టల్ తెలిపారు. ఎలక్షన్ సెంటర్ ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎలక్షన్ అబ్జర్వర్స్ పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో 284 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు. అధికారులు 35రూట్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో 1 పీఓ , 1 ఏపీఓ, ఇద్దరు ఓపీ పీవోలు మొత్తం 1,136మంది ఎన్నికల విధులకు హాజరయ్యారు. 152 మంది ఉద్యోగులు రిజర్వుడు లో ఉంచారు. 35 రూట్ లకు ఒక్కో రోడ్డుకు ఒక్కో సెక్టోరియల్ ఆఫీసర్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. రిజర్వుడు ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 1,288 మంది విధుల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఓటరు లిస్ట్ ఇతర సామాగ్రి అందజేశారు. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లే ముందు ఈవీఎంలు అందజేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.