- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుక్కల దాడిలో 12 మేకపిల్లల మృతి
దిశ, తాండూరు రూరల్ : కుక్కల దాడిలో 12మేక పిల్లలు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆడుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
మండలం చెంగేష్ పూర్ గ్రామంలో వీధి కుక్కలు దాడిచేయడంతో కుర్వ నర్సిములుకు చెందిన 12 మేకపిల్లలు చనిపోయాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల మేరకు, గ్రామానికి చెందిన కుర్వ నర్సిములు మేకలు మేపుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే వ్యవసాయ పొలం దగ్గర తన మేకలను ఓ పాకాల ఉంచారు. వీధికుక్కలు మేక పిల్లలపై దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో 12 మేకపిల్లలు చనిపోయాయి. దీంతో సుమారు లక్ష మేర నష్టం వాటిల్లిందని బాధితుడు లబోదిబోమంటున్నారు. నర్సిములు కుటుంబానికి మేకల ఆధారం కావడంతో.. ఎలా జీవనం కొనసాగించాలని ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని నర్సిములు వేడుకుంటున్నాడు.