- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరుగురిని చంపిన అన్సారీ ఇంటికి OYC ఎలా వెళ్తారు..? మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే నన్ను చంపుతామని బెదిరిస్తు్న్నారని ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆరు హత్యలు చేసిన ముక్తారీ అన్సారీ ఇంటికి అసదుద్దీన్ ఓవైసీ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మరీ హైదరాబాద్‌లో చనిపోయిన వారి కుటుంబాలను ఓవైసీ ఎందుకు పరామర్శించరని నిలదీశారు.
సోషల్ మీడియా బెదిరింపులకే ఆయన భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. నేను ఓవైసీకి వ్యతిరేంగా ధైర్యంగా మాట్లాడటంతోనే మా కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంతో చెప్పి వై కేటగిరీ భద్రత ఇప్పించారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో నా ప్రధాన ప్రత్యర్థి అసదుద్దీన్ ఓవైసీనేనని అన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ముక్తార్ అన్సారీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల వేళ ముక్తారీ అన్సారీ మరణంపై ఓవైసీ, మాధవీలత మధ్య డైలాగ్ వార్ హైదరాబాద్ పార్లమెంట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది.