- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూకంపం కారణంగా వణికిన మేడారం అమ్మవారి గద్దెలు.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం(Earthquake) సంభవించింది. కాగా దీనికి సంబంధించిన భూకంప కేంద్రం(epicenter) ములుగు జిల్లాలో కేంద్రికృతం అవ్వగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3 గా నమోదైంది. ఇదిలా ఉంటే ఈ భూకంపం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పలు ఉమ్మడి జిల్లాలో 2 నుంచి 5 సెకన్లపాటు.. ఉదయం 7.20 నిమిషాల తర్వాత ప్రకంపణలు వచ్చాయి. దీంతో ప్రజలు ఎమ్ జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా కొద్ది సేపటికే ప్రకంపణలు తగ్గిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో.. దేశంలోనే రెండో అతిపెద్ద జాతర జరిగే మేడారానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలు తెల్లవారుజామున.. ఆలయ పూజారులు.. సారక్క గద్దె పై పూజలు చేస్తుండగా.. ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో అమ్మవారి గద్దె మొత్తం ప్రకంపణలకు గురైంది. దీంతో ఆలయ పూజారి ఆందోళనకు గురి కావడం ఆ వీడియో లో స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనప్పటికి బుధవారం తెల్లవారుజామున తెలంగాణ ప్రాంతాన్ని స్వల్ప భూకంపం భయాందోళనకు గురిచేసిందనే చెప్పుకొవాలి.