Metro Rail : మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్ఆండ్‌టీ కీలక ప్రకటన

by Ramesh N |   ( Updated:2024-08-14 12:45:17.0  )
Metro Rail : మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్ఆండ్‌టీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజు సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొంది. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాల కోసమే పెయిడ్ పార్కింగ్ విధానం తీసుకు వచ్చినట్లు స్పష్టం చేసింది.

కాగా, పైలట్ రన్‌గా నాగోల్ మెట్రో స్టేషన్‌లో సంస్థ పెయిడ్ పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసింది. నిన్నటి వరకు ఫ్రీగా ఉన్న పార్కింగ్‌ను తొలగించి.. గంటకు ఓ రేటు చొప్పున రేటు ఫిక్స్ చేస్తూ యాజమాన్యం బోర్డు పెట్టింది. బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10, 8 గంటల వరకు రూ.25 రూపాయలు, 12 గంటల వరకు రూ.40, అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30, 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.

ఇది చూసిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే మెట్రో ఛార్జీలు తలకుమించిన భారంగా ఉందని, మళ్లీ పార్కింగ్ పేరుతో కొత్తగా దోపిడీ మొదలు పెట్టారంటూ వారు మండిపడ్డారు. వెంటనే పెయిడ్ పార్కింగ్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story