పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు

by Mahesh |
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మహానగరం మొత్తం ఆకాశం మేఘావృతంగా మారిపోయింది. దీంతో మరికొద్ది సేపట్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి.



Next Story