- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు లోక్‌సభ సచివాలయం షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌కు లోక్ సభ సచివాలయం షాక్ ఇచ్చింది. బీఏసీ నుంచి టీఆర్ఎస్‌ను లోక్ సభ సచివాలయం తొలగించింది. టీఆర్ఎస్‌కు ఇంకా బీఆర్ఎస్‌గా గుర్తింపు ఇవ్వలేదు. ఈ మేరకు లోక్ సభ బీఏసీలో కొన్ని మార్పులు చేస్తూ బుధవారం బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం బీఏసీలో బీఆర్ఎస్ ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. టీఆర్ఎస్ తరపున ఇప్పటి వరకు బీఏసీ సభ్యుడిగా నామా నాగేశ్వరరావు ఉన్నారు.
అయితే ఇవాళ్టి బీఏసీ భేటీకి నామాకు ఆహ్వానితుడిగానే ఆహ్వానం అందింది. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. అయితే టీఆర్ఎస్‌కు లోక్‌సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ ఆ పార్టీని ఆహ్వానితుల జాబితాలో పేర్కొనడం చర్చగా మారింది. ఇవాళ జరగనున్న బీఏసీ సమావేశంలో మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చకు తీసుకోవాల్సిన విధానంపై చర్చించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం పంపిన సమాచారంతో ఈ విషయం బహిర్గతం అయింది.