సీఎం రేవంత్‌తో లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ టీమ్ భేటీ

by Ramesh N |
సీఎం రేవంత్‌తో లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ టీమ్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిరో స్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, స్పేస్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్‌లో చర్చలు సైతం జరిపింది. అయితే, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి.

Next Story