BIG BREAKING: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ

by Shiva |   ( Updated:2024-07-18 11:31:07.0  )
BIG BREAKING: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మొదటి దఫాలో భాగంగా రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వేదికగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా బటర్ నొక్కి నిధులను విడుదల చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రుణమాఫీపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రూ.లక్ష లోపు బ్యాంకులకు బాకీ పడిన రైతులు 11,08,171 లక్షల మంది ఉన్నారు. అయితే, వారందరి రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం మొదటి దఫాలో రూ. 6,098 వేల కోట్లను విడుదల చేసింది.

Loan waiver : అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధుల జమముఖ్యంగా తొలి విడతలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రూ.454.49 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. దీంతో వారందరి రుణాలు ఒకే దెబ్బతో మాఫీ అయ్యాయి. అనంతరం రెండో దఫాలో భాగంగా ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక రూ.2 లక్షల రుణాలను ఆగస్టులోపు మాఫీ ప్రక్రియను పూర్తి చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. రుణమాఫీ వేళ రాష్ట్ర వ్యాప్తంగా 560 రైతు వేదికల్లో రైతులు, కాంగ్రెస్ నేతలు అంబరన్నంటేలా సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో సీఎం రేవంత్‌‌రెడ్డి ఫ్లెక్సీలు, చిత్ర పటాలకు కాంగ్రెస్ శ్రేణులు క్షీరాభిషేకం చేస్తున్నారు.

Advertisement

Next Story