Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కన్న కొడుకు కోసం మరో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత

by Shiva |   ( Updated:2024-03-19 12:13:30.0  )
Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కన్న కొడుకు కోసం మరో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉంది.ఈ మేరకు ఇవాళ తన కొడుకు, తల్లిని కలిసేందుకు గాను పర్మీషన్ ఇవ్వాలంటూ ఆమె ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేందుకు అనుమతిని ఇస్తూ తీర్పును వెలువరిచింది. కాగా, తనకు ఈడీ నోటీసులు సమన్లు జారీ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అయితే, ప్రస్తుతం కవిత ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆ పిటిషన్ పనికరాదని కోర్టు పేర్కొంది. దీంతో రిట్ పిటిషన్‌ను కవిత విత్‌డ్రా చేసుకుంది.

Advertisement

Next Story