LIQUOR SCAM : కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు

by Rajesh |
LIQUOR SCAM : కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేష్టిగేషన్) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అడిషనల్ చార్జ్ షీట్ నమోదు చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరు సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆప్ లీడర్లకు కిక్ బ్యాక్‌ల రూపంలో రూ.వంద కోట్లను కవిత అందించినట్లు ఈడీ తెలిపింది. అదే సమయంలో బెనిఫిట్ల రూపంలో తాను స్థాపించిన ఇండోస్పిరిట్ అనే సంస్థ నుంచి రూ.192 కోట్లను ప్రాఫిట్లుగా పొందినట్లు పేర్కొంది. మొత్తం కలిపి రూ.292 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. 2024 మేలో తొలిసారిగా ఈడీ కవిత పేరును చార్జ్ షీట్‌లో చేర్చింది. సౌత్ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఈడీ ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed