Liquor Sales: సర్కార్‌కు కాసుల పంట.. రెండు రోజుల్లో రూ.680 కోట్ల లిక్కర్ సేల్స్

by Shiva |   ( Updated:2025-01-02 02:11:48.0  )
Liquor Sales: సర్కార్‌కు కాసుల పంట.. రెండు రోజుల్లో రూ.680 కోట్ల లిక్కర్ సేల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం అమ్మకాలతో ఎక్సయిజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. రెండు రోజుల్లో రూ. 680 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రూ. 402 కోట్లు, డిసెంబర్ 31న రూ. 282 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 40 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టినట్లు ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి తొమ్మిది నుంచి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు చేసిన దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి పట్టుకోవడంతోపాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

287 ఈవెంట్స్ ద్వారా రూ.56.46 లక్షల ఆదాయం

నూతన సంవత్సర వేడుకలకు ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో 287 ఈవెంట్స్ కు అనుమతులిచ్చారు. వీటి ద్వారా రూ. 56.46 లక్షల ఆదాయం సమకూరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా, మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. కాగా, 2023 లో 224 ఈవెంట్స్ కు అనుమతులకు ఇవ్వగా, రూ.44.76 లక్షల ఆదాయం వచ్చింది.


Also Read...

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు @ 5,278.. గతేడాదితో పోల్చితే 17.65 శాతం అధికం

Advertisement

Next Story