- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాంఘిక సంక్షేమ హాస్టల్ లో కలెక్టర్ రాత్రి బస
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పీ జానకి,వివిధ శాఖల మహిళా అధికారులు సందర్శించారు. విద్యార్థినులతో కలిసి రాత్రి భోజనం చేశారు. భోజనం అనంతరం స్టోర్ రూం,కిచెన్,కూరగాయలు భద్రపరిచే రూం ను సందర్శించారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని,తాజా కూరగాయలు,ఆకుకూరలు అందించేలా కాంట్రాక్టర్ కు సూచించాలని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర,మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం,భూగర్బ జల వనరుల శాఖ డిడి రమాదేవి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి కౌసర్ జహాన్,మార్కెటింగ్ అధికారిణి బాల మణి,ప్రిన్సిపాల్ జయప్రద తదితరులు కూడా రాత్రి విద్యార్థిని లతో భోజనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కళాశాలలో విద్యార్థినులతో రాత్రి బస చేస్తారు.