నిరుద్యోగ నిరసన సభకు లైన్ క్లియర్.. డేట్ ఫిక్స్

by Sathputhe Rajesh |
నిరుద్యోగ నిరసన సభకు లైన్ క్లియర్.. డేట్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు నల్గొండ నిరుద్యోగ నిరసన సభకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 28న సభ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. తొలి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న జరగాల్సిన సభకు తనకు సమాచారం లేదని స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన సభ బుధవారం వాయిదా పడ్డట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో రంగంలో దిగిన ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ బలోపేతం కొరకు , పార్టీ చేపట్టిన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఇరు నేతలకు నొక్కి చెప్పారు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story