చేనేత రంగాన్ని కాపాడుకుందాం: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే

by Kalyani |   ( Updated:2023-05-20 13:16:56.0  )
చేనేత రంగాన్ని కాపాడుకుందాం: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆయన కోటకొండ శ్రీ మద్దిలేశ్వరి దేవాలయం వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వహించి మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి నిధులు, పథకాలు అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులకు సక్రమంగా ఫలాలు అందడం లేదన్నారు. చేనేత పరిశ్రమను కాపాడుకునే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.

అనంతరం చేనేత కార్మికులు మాట్లాడుతూ చేనేత పరిశ్రమ దయనీయంగా ఉందని కోటకొండ గ్రామాన్ని క్లస్టర్ గా ఎంపిక చేయాలని మంత్రిని కోరగా తన వంతు పూర్తి సహకారం చేస్తానని మంత్రి చెప్పారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని కుమ్మరులతో మాట్లాడారు. కుమ్మరులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించిన కుండల మిషనరీలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. అలాగే 60 శాతం కేంద్ర నిధులతో అప్పక్ పల్లి వద్ద నిర్మిస్తున్న జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగురావు నామాజీ, రతంగ పాండు రెడ్డి, కొండా సత్యా యాదవ్, జలంధర్ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed