కేసీఆర్, మోడీ దోస్తీ వివరిస్తాం.. మధుయాష్కీ గౌడ్, పొంగులేటి

by Javid Pasha |
కేసీఆర్, మోడీ దోస్తీ వివరిస్తాం.. మధుయాష్కీ గౌడ్, పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ,మోడీ దోస్తీని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తామని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరాభవన్​ లో స్టేట్ ప్రచార కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు థాక్రే ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. ఎన్నికలకు వెళ్లాల్సిన తీరు, వ్యూహాలు, చేయాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రవర్సీ లేని అసెంబ్లీ సెగ్మెంట్లలో ని అభ్యర్ధులను ఫస్ట్ లిస్టులో ప్రకటిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు ఫస్ట్ వీక్​లో 80 సీట్లు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 6న గాంధీ ఐడియాలజీ సెంటర్ లో మరోసారి ప్రచార కమిటీ మీటింగ్ ను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్​ తోడు దొంగలు అనే విషయాన్ని ప్రజలకు సూటిగా చెబుతామన్నారు. కేసీఆర్, మోడీ తెర వెనుక, తెర ముందు ఎట్లా కలసి పనిచేస్తున్నారనే దానిపై కూడా ప్రజలకు ఆధారాలతో సహా కాంగ్రెస్​ పార్టీ క్లారిటీ ఇస్తుందన్నారు. ఇక రుణమాఫీని ఐదేళ్లుగా పెండింగ్ లో ఉంచి ఇప్పుడు మిత్తి లేకుండా చేయడం సరికదన్నారు. దీనిపై పోస్టుకార్డు ఉద్యమం చేస్తామన్నారు.తెలంగాణాలో దోపిడీ జరుగుతోందని, అన్ని వర్గాలను మోసం చేస్తున్నారన్నారు.

ఇక్కడి సంపదను ఇతర రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. మరోవైపు ఏఐసీసీ, టీపీసీసీ, ప్రచార, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలతో ప్రత్యేక మీటింగ్​ కు ప్లాన్ చేస్తున్నామని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఈ మేరకు చీఫ్​గెస్ట్ గా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం హైదరాబాద్ కు రానున్నట్లు తెలిపారు. అంతేగాక పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారన్నారు. పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై జనాల్లోకి తీసుకెళతామన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వాళ్లను ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో చర్చిస్తున్నామన్నారు. దీంతో పాటు సానుభూతి పరులను కూడా కాపాడుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story