ఈ ఇద్దరు తోడు దొంగలను ఓడిద్దాం!.. బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-05-09 14:33:10.0  )
ఈ ఇద్దరు తోడు దొంగలను ఓడిద్దాం!.. బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండగా.. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రధాన పార్టీల నాయకులు ఒకరి పై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. వాటినే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఒక పక్క బీజేపీ తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటుంటే.. మరోపక్క బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు వంకాయ ఇచ్చిండని విమర్శిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు అని, వారిని ఓడిద్దాం అని పోస్ట్ పెట్టింది. దీనిపై నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిదగుడ్డు అని కాంగ్రెస్ అంటుంది.. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఇచ్చింది బైగన్(వంకాయ) అని బీజేపీ అంటుంది. ఈ ఇద్దరు తోడు దొంగల్ని ఓడిద్దాం. నిన్న, నేడు, రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడే కేసీఆర్ కే ఓటేద్దాం! అని ఎక్స్ లో కేసీఆర్ ఫోటోను పోస్ట్ చేసింది.

Read More...

ఈ దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు?..కేటీఆర్ షాకింగ్ ఆన్సర్

Advertisement

Next Story