పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ చాలెంజ్

by Prasad Jukanti |
పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ చాలెంజ్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/డైనమిక్ బ్యూరో:తెలంగాణలో సీశనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం ఐదు సార్లు పాలమూరుకు వచ్చారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంత బిడ్డగా తాను ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అందుకే ఓ మహిళ అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి దొరసాని, తొక్కుతా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నన్ను తొక్కుతా అంటావా? రా దమ్ముంటే ఎక్కడికోస్తావో రా? బిడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడుతావా? నీకు తల్లి, చెల్లి లేదా? నీకు బిడ్డా లేదా? ఒక మహిళా నేత గురించి ఎలా మాట్లాడాలి అన్న సంస్కృతి కూడా లేదా? మిస్టర్ రేవంత్ రెడ్డి నీ భాష మార్చుకో అంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అరుణమ్మ గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. ఒక మహిళను ఓడించేందుకు గుంపులు కట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు క్షమించరని, రేవంత్ రెడ్డి నీచ, అహంకార సంస్కృతిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారంటీలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఇక్కడి కొచ్చి నోటికొచ్చినట్లు తిట్టి పొతున్నారని రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి పాలమూరు కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

చాలెంజ్ కు సిద్ధమా?:

రేవంత్ రెడ్డి నా బాగోతం చెప్తానన్నావ్.. నీ బాగోతం ఏంటో నేను విప్పుతా.. దమ్ముంటే పాలమూరు తెలంగాణ చౌరస్తకి రావాలని చాలెంజ్ చేశారు. 'మిస్టర్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగవి ప్రధాని మోడీపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రి పదవి పరువు కాపాడు, గద్వాల కోట గురించి, నా నీతి జాతి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది?. డీకే సత్యరెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆగస్టులోగా రైతు రుణమాఫీ రాకపోతే నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హామీలు అమలు చేయకపోతే పదవి వదిలేస్తావా? ఈ సవాల్ కు సిద్ధమా? అని ప్రశ్నించారు. దేవుళ్ల మీద కాంగ్రెస్ దొంగ డ్రామాలు ఆపాలన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కుటుంబాల మీద ప్రమాణం చేయాలన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా సింపతీ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు? మీకు దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అరుణమ్మ గెలిస్తే పాలమూరుకు నిధులు వస్తాయన్నారు. 100 రోజుల్లో నేను అది చేశాను ఇది చేశాను అని గప్పాలు కొట్టడం తప్పితే ఏం చేశావో చెప్పాలన్నారు. ఎంతమంది రైతులకు రుణ మాఫీ చేశావో చెప్పాలని నిలదీశారు. పాలమూరు నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చావో చెప్పాలన్నారు. కాలేజీ ఇచ్చాను అని చెప్పుకుంటూ ఖాళీ సంతకం మాత్రమే పెట్టి ప్రజలకు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story