- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజలు చైతన్యవంతమైతేనే సమాజంలో మార్పు: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు చైతన్యవంతం అయితే తప్ప సమాజంలో మార్పు రాదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సహ చట్టంపై సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ అవగాహన సదస్సును గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అవినీతిపరుల అటకట్టించేందుకు దోహద పడుతుందని, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కావలసిన ఏ సమాచారం అయినా పొందే హక్కు ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం ఎంత గొప్పదో అంత నిర్లక్ష్యం చేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ రంగంలోనైనా ప్రభుత్వం చేస్తున్న పని ప్రజలకు స్పష్టంగా తెలియాలని, తెలుసుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించడం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో క్రియాశీలకంగా ఉంటుందన్నారు. సహచట్టంపై వీలైనన్ని సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి చైర్మన్ కేశవులు, ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వర రావు, సీబీఐ విశ్రాంత అధికారి బాలకిషన్ రావు, రాష్ట్ర కన్వీనర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.