చావనైనా చస్తాం కానీ.. ప్రభుత్వాన్ని మాత్రం వీడం: స్పీకర్ పోచారం

by Satheesh |   ( Updated:2022-12-06 10:32:55.0  )
చావనైనా చస్తాం కానీ.. ప్రభుత్వాన్ని మాత్రం వీడం: స్పీకర్ పోచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌ ఎమ్మెల్యేలు ఎవ‌రు డ‌బ్బుల‌కు అమ్ముడు పోరని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయన చిత్ర పటానికి స్పీకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూల్చాల‌ని కొంద‌రు ఆశ‌ప‌డ‌తున్నారని.. త‌మ ప్రాణం పోయినా ప‌ర్వాలేదు కానీ.. వారి ఆశ నెర‌వేర‌నియ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జ‌రుగుతుందని ఆరోపించారు. తన జీవితంలో కేసీఆర్ లాంటి గొప్ప నాయ‌కుడిని చూడ‌లేదని.. దేశానికి కేసీఆర్ నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉందన్నారు. పాద‌యాత్రలు చేసే పార్టీలు.. ఇంత‌కంటే ఎక్కువ‌గా.. ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపించేవాడు కాదు... ఆలోచించేవాడే ప‌రిపాలిస్తాడని వ్యాఖ్యానించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంపై కూడా త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను చావ‌నైనా చ‌స్తాను.. కానీ ప్రభుత్వానికి మాత్రం దూరం కానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story