చంద్రబాబుతో యాదవ హక్కుల పోరాట సమితి నేతల భేటీ.. సమస్యలపై సుధీర్ఘ చర్చ

by Vinod kumar |
చంద్రబాబుతో యాదవ హక్కుల పోరాట సమితి నేతల భేటీ.. సమస్యలపై సుధీర్ఘ చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదవుల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ముందుండి పోరాడుతుందని, రాబోయే ఎన్నికల్లో సైతం తగిన ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో గురువారం యాద‌వ హ‌క్కుల పోరాట స‌మితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుంట ర‌వీంద‌ర్ యాద‌వ్‌ ఆధ్వర్యంలో ఆసంఘం నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలోని రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు.

యాదవులను మభ్యపెట్టేందుకే కేసీఆర్ గొర్రెల పథకం ప్రవేశపెట్టారని, మునుగోడు ఎన్నికల్లో లబ్దిదారులకు నగదు ఇస్తామని చెప్పి బ్యాంకు ఖాతాలను ప్రీజ్ చేశారనే విషయాన్ని చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యాదవులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో యాద‌వ హ‌క్కుల పోరాట స‌మితి రాష్ట్ర క‌మిటీ నాయ‌కులు ఎర్రం స్వామి యాద‌వ్‌, కుమార స్వామి యాద‌వ్‌, రాజ‌న్న కలిశారు. ఈ కార్యక్రమంలో చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు రావుల చంద్రశేఖ‌ర్‌రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర స‌మ‌న్వయ క‌ర్త కంభంపాటి రాం మోహ‌న్‌రావు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed