వీఆర్వోలను రెవెన్యూలోకి తీసుకోండి.. మంత్రి పొంగులేటికి రిక్వెస్ట్

by GSrikanth |
వీఆర్వోలను రెవెన్యూలోకి తీసుకోండి.. మంత్రి పొంగులేటికి రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, వీఆర్వోలను తిరిగి తీసుకుంటే మేలు కలుగుతుందని ట్రెసా, వీఆర్వో జాక్ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం మృతి చెందిన వీఆర్వోల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మంత్రికి విన్నపాలు :

1. 178 మంది వీఆర్వోల కుటుంబాలకు కారుణ్య నియామకం హర్షనీయం.

3. రెవెన్యూ శాఖలో వీఆర్‌వోలు మరియు సిబ్బంది లేక ఇబ్బందులు.

4. రెవెన్యూ శాఖలో అపారమైన అనుభవం శ్రమ పడే తత్వం ఉన్న వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకొచ్చి అర్హులైన వారందరికీ పదోన్నతి కల్పించి మిగతావారికి సమానమైన హోదాతో రెవెన్యూ శాఖలో కొనసాగించాలి.

5. ఇప్పుడు భూప్రక్షాళన పెండింగ్ అప్లికేషన్‌ల పరిష్కారానికి రద్దయిన వీఆర్వోలందరినీ ప్రస్తుతం డిప్యూటేషన్ మీద రెవెన్యూ శాఖలోకి తీసుకువస్తే సమస్యలు పరిష్కారానికి సులభం.

6. భూ సమస్యల పరిష్కారానికి ఇతర శాఖల ఉద్యోగులను ఉపయోగించుకోవడంలో మేలు జరగదు వారికి భూ చట్టాల గురించి భూ రికార్డుల గురించి అనుభవం లేదు మరలా తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

7. ఇతర శాఖలో బదిలీ అయినా వీఆర్‌వోలు అనేక ఇబ్బందులకు గురి అవుతూ, కొంతమందికి జీతాలు రాక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

మంత్రిని కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే.గౌతమ్ కుమార్, వీఆర్వో జాక్ చైర్మన్ గోల్కొండ సతీష్ ఉన్నారు.

Advertisement

Next Story