- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాత్రి ఓల్డ్ సిటీ వీధుల్లో తిరుగుతా.. పేద యువకులను ఎలా కొడతారో చూస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గస్తీని పెంచారు. ఇందులో భాగంగా పాతబస్తీలో పోలీసుల పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటల తర్వాత వీధుల్లో గుమిగూడిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజలు, పేద యువకులతో పాటు, నైట్ డ్యూటికి వెళ్ళి వచ్చే ఉద్యోగులపై, ఆస్పత్రులకు వెళ్తున్న వారిపై కూడా లాఠి ఝులిపిస్తున్నారని అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ సభలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమెజ్‌ను దెబ్బతీస్తుందని.. పహారా పేరుతో.. ఇంటి ముందు ఉన్న వారిని కూడా పోలీసులు లాఠీలతో కొడుతున్నారు.. ఆలా కొట్టడం సరి కాదని అన్నారు. మరీ ముఖ్యంగా రాత్రి తనిఖీల పేరుతో గరీబ్ పిల్లలను కొడుతున్నారు.. వాళ్ళు నా పిల్లలే.. రేపటి నుంచి ఓల్డ్ సిటీ గల్లీల్లో రాత్రి పది గంటల తర్వాత నేను వుంటా ఎవరు వస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల ఏమైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే నేను బాధ్యుడిని కాదని ప్రభుత్వం బాధ్యత వహించాలని సభలో ఒవైసీ చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా నగరంలో గంజాయి, మందు బంద్ చేయించమని చెబుతున్నామని.. ఈ సాకుతో గరీబ్ పిల్లలను కొట్టొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులు, ప్రభుత్వానికి అసెంబ్లీ సాక్షిగా సూచించారు.