Lagacharla : లగచర్ల సురేష్ కు రెండు రోజుల పోలీసుల కస్టడీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-03 05:21:03.0  )
Lagacharla : లగచర్ల సురేష్ కు రెండు రోజుల పోలీసుల కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla)లో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి(Attack)) కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ (Suresh)కు కోర్టు రెండు రోజుల కస్టడీ(custody)విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికి కోర్టు రెండు రోజుల కస్టడికి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ లో సురేష్ ను పోలీసులు ఇవ్వాళ, రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్ కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు.. చర్చలు ఏమిటన్నదానిపై పోలీసులు సురేష్ ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు..దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనులనే రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తారని తెలుస్తోంది.

దుగ్యాల మండలం నుంచి కలెక్టర్ సభను లగచర్లకు ఎందుకు మార్పించారన్నదానిపై నిందితుడి నుంచి వివరాలు రాబట్టనున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అధికారులపై దాడులు చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డి, లేక ఇంకెవరి ప్రోద్భలం ఉందన్న విషయాలపై సురేష్ ను ప్రశ్నించి కేసు విచారణను మరింత పగడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ ఎవరి పేర్లు బయటపెడుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story