- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DK. Aruna : లగచర్ల ఘటన బాధాకరం : ఎంపీ డీకే.అరుణ
దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ సహా అధికారులపై జరిగిన దాడి ఘటన బాధాకరమని బీజేపీ సీనీయర్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీ.కే.అరుణ(MP DK. Aruna) అన్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇతర ఉన్నత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీ వద్దంటూ గతకొన్ని రోజులుగా స్థానికులు చాలా కోపంతో ఉన్నారని, అలాంటి పరిస్థితులలో సెక్యూరిటీ లేకుండా అధికారులు గ్రామానికి వెళ్లారన్నారు. ఈ క్రమంలో స్థానికులు సహనం కోల్పోయి దాడులు చేసినట్లు తెలిసిందని, అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. సామరస్య పూర్వకంగా, ఉద్యమాలు, చర్చలతో సమస్య పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు వారికి ఉందని, అయినప్పటికి దాడులకు దిగడం సరైంది కాదన్నారు. అయితే స్థానికంగా ఉన్న 6 గ్రామాల రైతులు ఫార్మా కంపెనీని చాలా వ్యతిరేకిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆ గ్రామాల ప్రజల అభిప్రాయాలను గౌరవించి చర్చలకు పిలవాలన్నారు. పార్టీ సీనియర్లను క్షేత్రస్థాయికి పంపించి అసలేం జరిగిందో నిజానిజాలు తెలుసుకుంటామని అరుణ తెలిపారు.