గణపతి మండపంలో లడ్డూ దొంగతనం.. వీడియో వైరల్

by Gantepaka Srikanth |
గణపతి మండపంలో లడ్డూ దొంగతనం.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు మరింత అట్టహారంగా స్టార్ట్ అయ్యాయి. కొన్ని కొన్ని చోట్ల అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా.. అనుకున్న సమయానికి అనేకచోట్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఇదిలా ఉండగా.. గణపతి మండలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు దేవుడి వద్ద లడ్డూను దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్దార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో చోటుచేసుకుంది. ఐదుగురు లడ్డూను చోరీ చేసి పారిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. పొద్దున్నే దేవుడి వద్ద లడ్డూ లేకపోవడం చూసి నిర్వహకులు ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed