బీఆర్ఎస్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కూనంనేని.. ఇక కారుతో కటీఫే..?

by Satheesh |
బీఆర్ఎస్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కూనంనేని.. ఇక కారుతో కటీఫే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కారు గుర్తు పార్టీకి కమ్యూనిస్టుల బంధానికి ఎండ్ కార్డు పడబోతోందా? ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వంటి ఆపద సమయంలో అండగా నిలిచిన ఎర్రన్నలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్‌ను కమ్యూనిస్టులు ఖండిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారుతోంది. సోమవారం మరోసారి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

భద్రాద్రి జిల్లాలో మాట్లాడిన కూనంనేని బీఆర్ఎస్‌తో పొత్తుపై ఘాటు‌గా రియాక్ట్ అయ్యారు. పొత్తులు ఆసరాగా చేసుకుని కమ్యూనిస్టు పార్టీని ఉద్దేశించి కొంత మంది బీఆర్ఎస్ నేతలు అవహేళనగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీపీఐ గురించి బీఆర్ఎస్ వాళ్లు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. వ్యంగ్యంగా మాట్లాడే నేతలను అధిష్టానం కంట్రోల్ చేయాలని సూచన చేశారు. పినపాకలో సీపీఐ 5 సార్లు గెలిచిందని ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే ఇటీవల కమ్యూనిస్టులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్‌తో పొత్తు కంటిన్యూ చేస్తూనే మరో వైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా సమస్యలపై నిజంగా పోరాటం చేయాలని భావిస్తే సీపీఐ, సీపీఎంలు అధికార పార్టీ మద్దతును ఉపసంహరించుకుని పోరాటాలు చేయాలనే టాక్ వినిపిస్తోంది.

ఓ వైపు బీఆర్ఎస్‌తో అంటకాగుతూనే.. మరో వైపు కారు పార్టీ నేతలు తమను అవమానించేలా మాట్లాడుతున్నారని బాధపడటం వెనుక మతలబు ఏంటని ఇతర ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ విషయంలో కమ్యూనిస్టు నేతల నుంచి రోజు రోజుకు స్వరం పెరుగుతుండటంతో ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య మధ్య స్నేహంపై కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed