KTR కొడుకు బర్త్ డే.. మనువడిపై ప్రేమతో భారీ కేక్ కట్ చేయించిన KCR, శోభమ్మ

by Satheesh |
KTR కొడుకు బర్త్ డే.. మనువడిపై ప్రేమతో భారీ కేక్ కట్ చేయించిన KCR, శోభమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పుట్టిన రోజు (జూలై 12) వేడుకలు తాత కేసీఆర్, నాయనమ్మ శోభమ్మ నడుమ ఘనంగా జరిగాయి. 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ ఒడిలోకి అడుగుపెట్టిన మనుమడు హిమాన్షు బర్త్ డే సెలబ్రేషన్స్‌ను కేసీఆర్, శోభమ్మ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. టీనేజ్ దాటుతున్న మనుమడికి నాయనమ్మ శోభమ్మ ప్రేమతో 19 కేజీల భారీ కేక్‌ను తెప్పించి కట్ చేయించారు. అనంతరం హిమాన్షు తాత కేసీఆర్, నానమ్మల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది నడుమ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బర్త్ డే రోజున ఫామ్ హౌస్‌లో హిమాన్షు మొక్కను నాటారు. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హిమాన్షు తల్లి, కేటీఆర్ సతీమణి శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed