- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Thalasani Srinivas: ఇథనాల్ కంపెనీతో మాకు సంబంధం లేదు.. మాజీ మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా (Nirmal District)లో దిలావర్‌పూర్ (Dilawarpur)లో ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory) ఏర్పాటు రణరంగంగా మారింది. తమ ప్రాంతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకూడదంటూ గత 130 రోజులుగా గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరసనలు హింసాత్మకంగా మారడంతో తాజాగా గ్రామస్థులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లుగా సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు వెంటనే పనులను నిలిపివేయాలని కంపెనీ యాజమాన్యాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ (Collector Abhilash Abhinav) ఆదేశించారు.
అయితే, ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory)లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Former Minister Thalasani Srinivas Yadav) కుమారుడికి వాటాలు ఉన్నాయంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో వారిపై కామెంట్స్‌పై తాజాగా మాజీ మంత్రి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిలావర్‌పూర్ (Dilawarpur) ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory)తో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలిపారు. ఎనిదేళ్ల క్రితం తన కుమారుడు పీఎంకే కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడని.. రాజమండ్రిలో కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినా అక్కడ కంపెనీ ఏర్పాటు రద్దు కావడంతో ఆ గ్రూప్ నుంచి తమ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారని అన్నారు. ఒక్కసారైనా తాను కానీ, తమ కుటుంబ సభ్యులు నిర్మల్ వెళ్లినట్లుగా నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్ విసిరారు.