KTR : కష్ట కాలంలో 8 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఇలా చేస్తారా.. BJPపై కేటీఆర్ సంచలన ట్వీట్

by Sathputhe Rajesh |
KTR : కష్ట కాలంలో 8 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఇలా చేస్తారా.. BJPపై కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎంపీ సీట్లు గెలిపించి ఆశిర్వదిస్తే.. ఏం ఇచ్చారని మండిపడ్డారు. కష్టకాలంలో 8 ఎంపీ సీట్లను గెలిపిస్తే తాజా బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు పొడగింపునకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. గతంలో సైతం తాము కేంద్ర ప్రభుత్వానికి రిప్రజేంటేషన్ ఇచ్చామని అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. గత పదేళ్లలో దేశంలో బీజేపీ 20 మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించిందని లెక్కలతో కేటీఆర్ వెల్లడించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో (4 ప్రాజెక్టులు) - రూ.5,134 కోట్లు

మహారాష్ట్రలో (మూడు ప్రాజెక్టులు) - రూ.4,109 కోట్లు

గుజరాత్ (మూడు ప్రాజెక్టులు) - రూ.3,777 కోట్లు

ఢిల్లీ (2 ప్రాజెక్టులు) - రూ. 3,520 కోట్లు

కర్ణాటక- రూ. 1880 కోట్లు

మధ్యప్రదేశ్ (రెండు ప్రాజెక్టులు) - రూ. 1,638 కోట్లు

బీహార్ - రూ.1,400 కోట్లు

తమిళనాడు - రూ.713 కోట్లు

కేరళ (2 ప్రాజెక్టులు) - రూ.146 కోట్లు

రాపిడ్ రైలు ప్రాజెక్టు (ఢిల్లీ-ఘజియాబాద్) - రూ. 1,106 కోట్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. దురుదృష్టవశాత్తు హైదరాబాద్ మెట్రో లీస్ట్ అమౌంట్ పొందిందన్నారు. ఇది అన్యాయం.. అత్యంత దారుణమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story