- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాజా మాజీ సర్పంచులకు కేటీఆర్ కీలక సందేశం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఇవాళ్టి నుంచి అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ సర్పంచులు మాత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకూ తమనే పదవిలో కొనసాగించాలని కోరుతున్నారు. లేదంటే పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొనసాగింపు ఉండదని తేల్చి చెప్పేసింది.
అయితే, ఈ క్రమంలో పదవీకాలం ముంగిచుకున్న సర్పంచ్‌లకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సందేశం పంపించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదని అన్నారు. ఐదేళ్ల కాలం పాటు తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసిన గ్రామ సర్పంచులు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో సర్పంచులు పాత్ర ఎనలేనిదని అన్నారు. మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.