- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తాడట.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టా్త్మకంగా తీసుకున్న మూసీ(Musi) పునరుజ్జీవనం కార్యక్రమంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వల్లే మూసీ పాడైపోయినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4 వేల కోట్లతో అనేక చోట్ల ఎస్టీపీలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. గోదావరి నీళ్లను తీసుకొచ్చి మూసీలో కలపాలనుకున్నామని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతున్నారు..
గతంలో ఇలా మాట్లాడిన వాళ్లంతా తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాటలు విని ఓటేసిన ప్రజలందరికీ క్లారిటీ వచ్చిందని.. చేతులు కాలినాక మోసపోయిన విషయాన్ని గ్రహించారని అన్నారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు విని పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు. ‘మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో’ అన్నది రేవంత్ రెడ్డి నినాదం అని సెటైర్ వేశారు.