- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే కవిత అరెస్ట్ కాలేదు.. లిక్కర్ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ-టీమ్ కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో తమకు పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులో కూడా ఉండబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అయి ఉంటే.. లిక్కర్ కుంభకోణం కేసులో కవితపై కేసు పెట్టేదా? అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం తనకు ఆ కేసుతో సంబంధం లేకపోవడమే.. బీజేపీతో ఉన్న సంబంధం ఎట్టి పరిస్థితుల్లో కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యం వల్లే కవిత అరెస్ట్ కాలేదని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రహస్య ఒప్పందానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషనే నిదర్శనం అని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవగానే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్దతి మారిందని ఎద్దేవా చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా పోలింగ్ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. బీజేపీ రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. తాము కూడా యాదాద్రి అక్షింతలు రాష్ట్ర వ్యాప్తంగా పంచి ఉంటే గెలిచే వాళ్లమని కీలక వ్యాఖ్యలు చేశారు.