- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తక్షణమే చర్యలు తీసుకోండి.. సీఎస్‌కు కేటీఆర్ కంప్లైంట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వెబ్‌సైట్లు, డిజిటల్ విధ్వంసంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా స్పందించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని కోరారు. కేసీఆర్ హయాంలోని సమాచారం, వివరాలు తొలగించారని అన్నారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని చెప్పారు. భావి తరాల కోసం ఈ డిజిటల్ సంపదను రక్షించాలని కోరారు. వెంటనే సీఎస్ తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. కాగా, గతంలోనూ అధికారిక వెబ్‌సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం మాయం అవుతోందని ఆరోపించారు. దీని వెనుక పాలకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన సాగించారని కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని వేల కొలది ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.