కేసీఆర్ మాటలను గుర్తుకుతెచ్చిన కేటీఆర్ కామెంట్స్.. ఎంపీ ఎన్నికల సమయంలో రియలైజ్

by GSrikanth |   ( Updated:2024-01-07 10:08:32.0  )
కేసీఆర్ మాటలను గుర్తుకుతెచ్చిన కేటీఆర్ కామెంట్స్.. ఎంపీ ఎన్నికల సమయంలో రియలైజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. 'బంధు' పథకాల ప్రభావం తమపై పడిందని అన్నారు.

కేటీఆర్ మాట్లాడిన తీరు గతంలో గులాబీ బాస్ మాటలను గుర్తుకు తెచ్చుకున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ‘దళితబంధులో మీరంతా వసూళ్లకు పాల్పడుతున్నారు. మీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇంకోసారి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే మీ తోకలు కత్తిరిస్తా’ అని కేసీఆర్ అప్పటి ఎమ్మెల్యేలను హెచ్చరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు కమీషన్ వసూళ్లు చేస్తున్నారని కేసీఆర్ డెరెక్టుగానే చెప్పారు. అయిన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లు ఇచ్చారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర వహించాల్సి వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన తీరు.. రియలైజ్ అయ్యి అలాంటి పోరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. లేదంటే పార్టీకి తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కార్యకర్తలది తప్పు కాదని, నాయకులుగా మనమే బాధ్యత వహించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివార్ రెడ్డి ఇవాళ తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ తప్పులు అర్థం చేసుకుని కాంగ్రెస్ దూకుడుని ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story