‘సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి’.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ట్వీట్

by Gantepaka Srikanth |
‘సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి’.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydra) కూల్చివేతలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupati Reddy) టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు.. LKG చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. తిరుపతి రెడ్డి గారి విషయంలో మాత్రం నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!.. మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి’’ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed