- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రథం ఘటనపై సీఎం సీరియస్... అధికారులకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్‌లో రథం దగ్థమైన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. రథం దగ్ధం (Chariot burn) ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరగా నిందితులను గుర్తించి కఠినంగా శక్షించాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. డాగ్‌స్వాడ్‌తో రథం దగ్థం స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా హనకనహాల్‌లో శ్రీరామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు గత రాత్రి నిప్పుపెట్టారు. దీంతో రథం సగానికి పైగా దగ్ధం అయింది. స్థానికులు మంటలార్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రథం దగ్ధంపై కావడంపై బీజేపీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.