Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కామ్ కేసులో అనూహ్య పరిణామం

by Prasad Jukanti |
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కామ్ కేసులో అనూహ్య పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. ముడా కుంభకోణంలో సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్ కు ఉందంటూ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూర్ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూముల కేటాయింపుల వివాదంలో సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన భూములు ఆయన తన భార్య పార్వతికి దక్కేలా కుట్ర చేశారని కొంత మంది ఆర్టీఐ కార్యకర్తలు గతంలో ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేశారు. వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. థావర్ చంద్ గహ్లోట్ ఇచ్చిన ఆదేశాలను సీఎం హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు సిద్దరామయ్యకు షాకిచ్చింది. కాగా హైకోర్టు తీర్పుపై కర్ణాటక సీఎం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story