- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
China: లెబనాన్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన చైనా
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపైన చైనా కీలక ప్రకటన చేసింది. లెబనాన్ కు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. లెబనాన్ దేశ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకునేందుకు తమ మద్దతు ఉందని బీజింగ్ వెల్లడించింది. సోమవారం చైనా, లెబనాన్ విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, అబ్దుల్లా బవూ హబిబ్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను వాంగ్ యీ ఖండించారు. పరిస్థితి ఎంతలా మారినప్పటికీ.. చైనా న్యాయం వైపు ఉంటుందని వాంగ్ యీ అన్నారు. లెబనాన్ సహా అరబ్ సోదరులకు అండగా ఉంటామన్నారు. ప్రాంతీయ పరిస్థితులన చైనా గమనిస్తోందన్నారు. లెబనాన్‌లో ఇటీవల జరిగిన కమ్యూనికేషన్ పరికరాల పేలుడు, పౌరులపై విచక్షణారహిత దాడులను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
శాంతి కోసం కృషి చేస్తాం
చైనా పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తోందన్నారు. అరబ్ సమాజం, అంతర్జాతీయ మిత్రులతో కలిసి శాంతి స్థాపనకు కృషి చేస్తామన్నారు. హింసకు హింసతో పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత వల్ల అతిపెద్ద మానవతా సంక్షోభం తలెత్తే అకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సమాజం స్పష్టమైన వైఖరిని ఏర్పరచుకోవాలని సూచించారు. ఇప్పటివరకు గాజాకు పరిమితమైన హమాస్-ఇజ్రాయెల్ పోరు.. ఇప్పుడు లెబనాన్ వైపునకు విస్తరించిందన్నారు. గత వారం జరిగిన కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్ల వల్ల హెజ్ బొల్లా అగ్రనేతలు చనిపోయారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా చనిపోయారు.