- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుమల శ్రీవారిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారు.. మాజీ స్పీకర్ ఆందోళన
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Former Speaker Tammineni Sitaram) అన్నారు. తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై ఆయన స్పందించారు. నెయ్యి కల్తీ (Ghee adulterated) ఘటనపై ఒక్కొక్కరు ఒక్కో మాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చాక రెండు నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. చంద్రబాబు హయాంలో వచ్చిన నెయ్యి కల్తీ జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ(Ycp Government) హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగితే విచారణ జరిపి నిందితులను శిక్షించాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
Read more : భూమన నాశనం మొదలైంది: దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్ జోస్యం